బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రేవంత్.. మంచిపనేనా?
గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీకు చెందిన కిషన్ రెడ్డి,బండారు దత్తాత్రేయ కలిశారని దీనికి రఘునందన్ రావు ఏ సమాధానం చెబుతారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కేసీఆర్ను కూడా కలిశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే తాము చాలా మాట్లాడాల్సి వస్తుందన్న జగ్గారెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదన్నారు. మరి ఆ విషయం కూడా వాస్తవమే కదా అనిపించకమానదు.