వైసీపీ కొత్త లిస్ట్ వచ్చేసింది. జగన్ ఆదేశాల మేరకు పలు పార్లమెంట్ నియోజకవర్గాలకు రీజినల్ కో-ఆర్డినేటర్లను పార్టీ నియమించింది. ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పత్రిక ప్రకటన విడుదలైంది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు పార్లమెంటు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. అలాగే వి.విజయసాయిరెడ్డి- గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. పి.రామసుబ్బారెడ్డి - కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు.
అదే విధంగా కె.సురేష్ బాబు - కడప పార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కో-ఆర్డినేటర్‌గా గుడివాడ అమర్నాథ్ను సంబంధిత రీజినల్ కో-ఆర్డినేటర్ ఆధ్వర్యంలో పని చేసేలా నియమించారు. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మల్లాది విష్ణును వైసీపీ నియమించింది.