హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ రోగుల పాలిట వరంగా మారుతోంది. ఇందులో తాజాగా క్యాన్సర్ వ్యాధిని విజయవంతంగా జయించిన సర్వైవర్స్ తమ భవిష్యత్తు జీవితాన్ని ఇబ్బందులు లేకుండా గడపడానికి వీలు కలిపించే విధంగా ఆప్టర్ కంప్లీట్ ఆఫ్ థెరిపీ క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ ప్రారంభ కార్యక్రమంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ కె కృష్ణయ్య, జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ డాక్టర్ పూర్ణ కుర్కురే, మెడికల్ ఆంకాలజీ విభాగం హెడ్ డాక్టర్ సెంథిల్ రాజప్ప, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా రఘునాథ్, మెడికల్ ఆంకాలజీ విభాగపు వైద్యులు డాక్టర్ యం వి టి కృష్ణ మోహన్, డాక్టర్ వీరేంద్ర పాటిల్, డాక్టర్ పల్లవి తదితరులు పాల్గొన్నారు.
చికిత్స అనంతరం రోగుల బాగోగులనూ తీర్చాలనే ఉద్దేశ్యంతో మెడికల్ ఆంకాలజీ విభాగం యాక్ట్ క్లినిక్ ను ప్రారంభించారు. ఈ క్లినిక్ ద్వారా క్యాన్సర్ ను జయించిన వారు చికిత్స పూర్తి చేసుకొని తమ జీవితాంతం సాధారణ జీవనాన్ని సాగించడానికి కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తారు.