ప్రేమించలేదని.. గురువుకు చుక్కలు చూపించిన శిష్యురాలు?
ప్రేమను తిరస్కరించాడని గురువు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు ప్రారంభించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టి గురువు కుటుంబాన్ని వేధించింది. గురువు కుటుంబసభ్యుల ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి సతాయించింది. సామాజిక మాధ్యమాల పోస్టులపై సదరు గురువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గురువును వేధిస్తున్న యువతిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమించాలి.. కానీ.. అవతలి మనిషి స్పందన ఏంటో కూడా తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయని గుర్తించాలి.