ఏపీ ప్రభుత్వం కల్పించిన ఉచిత వసతిలో విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులకు సాధారణ పరిపాలనశాఖ నోటీస్ జారీ చేసింది. సచివాలయం, హెచ్ఓడీలకు చెందిన ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ ను వాడుకున్నారని పేర్కొన్న సాధారణ పరిపాలనశాఖ.. ఉద్యోగులకు కేటాయించిన రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించారని పేర్కొంది.
3 లక్షల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని పేర్కోంటూ జీఏడీ లేఖ రాసింది. ఏపీ సచివాలయ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, ఏపీ ఎన్జీజీవో సంఘాల అధ్యక్షులకు లేఖ రాసిన జీఏడీ అధికారులు.. అదనపు విద్యుత్ వినియోగానికి సంబంధించి ఈ ఛార్జీలు కట్టాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా తక్షణం ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా జీఏడీ ఉద్యోగులను కోరింది.