జగన్ భవిష్యత్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు?
వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నాడని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని.. జగన్ భారీ అపజయాన్ని మూట కట్టుకోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల మీడియా రచ్చ రచ్చ చేస్తోంది. గత ఎన్నికల్లో జగన్ కోసమే పని చేసిన వ్యక్తి కావడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ ఎన్నికల జోస్యం ఎంత వరకూ నిజం అవుతుందో కొన్ని నెలల్లో తేలిపోతుంది.