ప్రశాంత్‌ కిషోర్‌ను కూడా చంద్రబాబు మార్చేశాడా?

Chakravarthi Kalyan
వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోబోతున్నాడని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ఓ మీడియా సంస్థ కార్యక్రమంలో చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్‌ భారీ అపజయాన్ని మూట కట్టుకోబోతున్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ఆ కార్యక్రమంలో చెప్పారు. అయితే ప్రశాంత్ కిషోర్‌ వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖ సర్క్యూట్ హౌజ్ లో మీడియా తో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ప్రశాంత్ కిషోర్ బీహార్ కు చెందిన వ్యక్తి అని.. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని పికే మాట్లాడుతున్నాడని అన్నారు.

చంద్రబాబు ఏమైనా మాటలు మాంత్రికుడా అన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు టిడిపి ఓడిపోతుందని చెప్తున్నారన్నారు. పొలిటికల్ కన్సల్టెన్సీ అనేది ఒక బిజినెస్ గా నడుస్తోందన్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ప్రజల్లో బలం లేక ఇలాగే మాట్లాడతారన్నారు. జగన్ కుటుంబసభ్యులను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని.. అలాంటిది ప్రశాంత్ కిషోర్‌ను ప్రభావితం చేయడం పెద్ద విషయం కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: