టీడీపీతో పొత్తుపై బీజేపీ రియాక్షన్ ఇదే?
సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తామన్న పురందేశ్వరి.. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారని.. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదేనని తెలిపారు. 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు వచ్చాయన్న పురందేశ్వరి.. జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నామన్నారు. మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు.