యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 21 వరకు జరిగే పంచనారసింహుల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు ఇవాళ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండోసారి జరుగుతున్నాయి. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, 18న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరుగుతాయి. ఈ నెల 21న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి.
తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పలువురు మంత్రులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. తిరుకల్యాణోత్సవంలో రేవంత్ రెడ్డి దంపతులు.. పాల్గొని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయానికి రావడం ఇదే ప్రధమం. యాదాద్రిలో పూజల తర్వాత ఆయన భద్రాచలం వెళ్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈనెల 11నుంచి 21వరకు పలు సేవలను రద్దు చేశారు.