పదేళ్ల నుంచి
భాజపా నేతలు, మోదీ,
అమిత్ షా...
కేసీఆర్ మీద నిందలు మోపడం తప్ప ఒక్కటీ నిరూపించడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలనే చేర్చుకుని అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో
బీజేపీ,
కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని మాజీ
మంత్రి నిరంజన్
రెడ్డి అన్నారు. మీరు అంత బలంగా ఉంటే అభ్యర్థులు ఎందుకు కరువయ్యారని మాజీ
మంత్రి నిరంజన్
రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీని వీడుతున్న నేతల గురించి ప్రజాక్షేత్రంలో ప్రజలే తేలుస్తారని మాజీ
మంత్రి నిరంజన్
రెడ్డి అన్నారు.
పొరపాటున
కాంగ్రెస్, బీజేపీకు ఓటేస్తే మనను మనం దహించుకున్నట్లే అన్న మాజీ
మంత్రి నిరంజన్ రెడ్డి..
తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఆలోచించాలని కోరారు.
కాంగ్రెస్ విపరీత హామీలు అమలుచేయాలని విపక్షంగా బీఆర్ఎస్ నిలదీయకుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని మాజీ
మంత్రి నిరంజన్
రెడ్డి అన్నారు.