మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని 19 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఎంపికైన వివిధ రంగాలకు చెందిన 19 మంది మహిళలకు ఇవాళ అవార్డులను ప్రదానం చేస్తారు. క్రీడారంగం నుంచి టి.చికిత, కుడుముల లోకేశ్వరి అవార్డులు అందుకుంటారు. సాహిత్యం విభాగంలో ముక్తేవి భారతి, దేవనపల్లి వీణవాణి, సురయ జబీన్, విద్యా రంగంలో సరోజన, హస్తకళల రంగం నుంచి బినా కేశవరావు, సామాజిక సేవ రంగం నుంచి గుర్రాల సరోజ, జమీల నిషాత్‌కు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. అవార్డుకు ఎంపికైన వారికి లక్ష రూపాయల పురస్కారం, గుర్తింపు పత్రం ఇస్తారు.
ప్రత్యేక కేటగిరిలో అరిపిన విజయలక్ష్మి, నృత్యంలో భాగ్యలక్ష్మి, ప్రొఫెసర్ అరుణ భిక్షు, పేర్ని నాట్యంలో సునీల, బోనాల కోలాటం పునరుద్ధరణలో బండి రాములమ్మ, గొరిగె నీల అవార్డులకు ఎంపికయ్యారు. డప్పు కళాకారిణి మట్టడి సారవ్వ, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న సీహెచ్ పుష్పలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. మహిళ వ్యాపారం విభాగంలో లుఖ్మా కమ్యూనిటీ చికెన్, మహిళ భద్రత కేటగిరిలో దక్షిణ మధ్య రైల్వే మహిళ ఆర్పీఎఫ్ శక్తి టీంను ఎంపిక చేశారు.