అసలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఏమైంది?
పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. నాకు రాజీనామా తప్పా మరో మార్గం కనిపించలేదని.. బరువైన గుండెతో బీఎస్పీకి రాజీనామా చేస్తున్నానని.. ఇటీవలి నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టంకలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు. నన్ను నమ్మి నాతో నడిచిన స్వేరోలను మోసం చేయలేనన్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.. భారాస, బీఎస్పీ పొత్తు లేకుండా భాజపా ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనని.. అందరితో చర్చించాక భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని.. భవిష్యత్‌లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి నడుస్తానని అంటున్నారు.