జగన్కు బిగ్ షాక్ ఇచ్చిన ఈసీ.. వాళ్లపై యాక్షన్?
అలాగే ప్రధాని మంత్రి కార్యక్రమం లో భద్రతా లోపాల పై ఫిర్యాదు వచ్చింది దానిని కేంద్రానికి పంపించామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా .. ఆ అంశం హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందన్నారు. వాలంటీర్ లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసి స్పష్టం గా పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా .. పాల్గొంటే చర్యలు తీవ్రంగానే ఉంటాయన్నారు. ఎన్నికల విధుల్లో ఉండి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం జిల్లా డీఆర్వో తో పాటు మరో డీఅర్వో పై కూడా చర్యలు తీసుకున్నారు.