రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఓ రాజకీయ నాయకుడికి ఇది అతి పెద్ద కల.. ఆ కల సాకారం చేసుకోవాలని ప్రతి నాయకుడు తపిస్తాడు. కానీ.. వందలో ఒక్కరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. రాజకీయ వారసులకు అది ఇంకాస్త సులభం అవుతుంది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ విషయానికి వస్తే.. సీఎం పదవి ఆయన్ను ఊరిస్తూనే ఉంది. కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత.. పదవి నుంచి దిగిపోయి కేటీఆర్కు పదవి అప్పగిస్తారని అంతా భావించారు. కానీ ఎందుకనో ఆయన ఆ సాహసం చేయలేదు.
కానీ.. ఇప్పుడు అదే తప్పుగా మారుతోంది. ప్రస్తుతం ఓటమి తర్వాత బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ను బీజేపీ కబళిస్తుందన్న వాదన ఉంది. మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచినా.. మళ్లీ సీఎం కేసీఆరే అవుతారు. మరి ఇక కేటీఆర్ కు సీఎం అయ్యే ఛాన్సు లేదా.. అంటే ఇప్పట్లో ఆ అవకాశాలు కనిపించడం లేదనే చెప్పాలి.