దేశంలో ప్రజల స్పందన చూస్తోంటే 400 పైగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామనే నమ్మకం కలుగుతోందంటున్నారు బీజేపీ నేతలు. మోడీ పాలనను చూసి అనేక మంది భాజపాలో చేరుతున్నారని.. రాష్ట్రంలో 12 నుంచి 15 స్థానాలు గెలుచుకుoటామనే విశ్వాసం ఉందని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. అభివృద్ధి జరగాలంటే తెలంగాణలో మెజారిటీ స్థానాలు భాజపా గెలవాలని.. ప్రతి గ్రామంలో మోడీ నామం వినిపిస్తోందని.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. మోడీ సర్కార్ రావాలని యావత్ దేశం కోరుకుంటుందని డీకే అరుణ అంటున్నారు.
అసలు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడా..? అర్హత ఉందా..? అని ప్రశ్నించిన డీకే అరుణ.. కనీసం ప్రధాని అభ్యర్థిగానైనా రాహుల్ పనికొస్తాడా అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఆరు గ్యారెంటీలు అమలవుతాయని కాంగ్రెస్ చెబుతోందన్న డీకే అరుణ... ప్రధాని సహాయం లేకుండా ఆరు గ్యారెంటిలు అమలు కావని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అర్థం అయ్యిందని ఎద్దేవా చేశారు.