బ్రేకింగ్: పాకిస్తాన్ నేవీపై దాడి.. 12 మంది మృతి?
ఈ దాడికి తమదే బాధ్యత అని ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. తాము చేసిన దాడిలో 12 మంది పాకిస్థానీలు మృతి చెందినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యం మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. అయితే ఇలా ఈ తరహా దాడికి యత్నించడం ఈ వారంలో ఇది రెండోసారి కావడం విశేషం. ఈనెల 20న కూడా గ్వాదర్ పోర్టుపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురు తీవ్రవాదులను చంపేశాయి.