ఏపీ: రాసిపెట్టుకోండి.. 145 సీట్లతో ఆ పార్టీకి బంపర్ విక్టరీ?
తాజాగా ఆయన ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీతో పొత్తు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. కూటమి గెలుపును మాత్రం ఆపలేదన్నారు. కూటమికి 100-145 స్థానాలు దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లోక్ సభ విషయానికొస్తే 19-21 సీట్ల వరకు వస్తాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.