అబద్దాలలో రేవంత్ రెడ్డికి ఆస్కార్ ఇవ్వాలా?
మాట తప్పడం, అబద్ధాలు ఆడడం రేవంత్ నైజమన్న హరీశ్ రావు .. వెంకట్రామిరెడ్డిని లోకల్ కాదంటున్నావు, ఆయన ఇక్కడే స్థిరపడిన ఓటర్ అని.. కొడంగల్‌లో ఓడిపోయి మల్కాజిగిరికి పోయింది నువ్వేనని హరీశ్ రావు అన్నారు. నా ఎత్తుతో రేవంత్‌కు ఏం పని? రైతుల గురించి ఆలోంచి, సమస్యలు పరిష్కరించాలని.. అహంకారంతో గాల్లో తేలుతున్న కాంగ్రెస్ భూమ్మీది రావాలంటే వెంకట్రామిరెడ్డిని పార్లమెంటుకు వెళ్లాలని హరీశ్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు 18 రోజులుగా వేచిచూస్తున్నా ప్రభుత్వం కొనడం లేదన్న హరీశ్ రావు .. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొన్నామని గుర్తు చేశారు.