ఇదేందయ్యా ఇది: 600లకు 599 మార్కులా.. మార్కులేనా ఇంకేమైనానా?
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో వెంకట నాగసాయి మనస్వీకి 100కు వంద మార్కులు వచ్చాయి. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన వెంకట నాగసాయి మనస్వీ మార్కులు చూసి ఆమె తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. విచిత్రం ఏంటంటే... ఆమె తల్లితండ్రులైన ఆకుల నాగ వరప్రసాద్, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే.