పాతబస్తీని హైటెక్ సిటీ చేస్తానంటున్న మాధవీలత?
హైదరాబాద్ పార్లమెంట్ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా ప్రచారంలో పాల్గొన్నారు. గత యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో దేశంలో రక్షణ వ్యవస్థతో పాటు... అన్ని రంగాలు బ్రష్టు పట్టాయని... కానీ పదేళ్ల మోదీ ప్రభుత్వంలో రక్షణ శాఖ ఆయుధాలను తయారు చేసే స్థాయిలో అభివృద్ధి చెందిందని రాధోడ్ అన్నారు. మోదీ ప్రభుత్వంలో 80 దేశాలు మన దేశం నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే... నిర్ణయం ప్రజల చేతుల్లో ఉందని.. భాజపాకి ఓటు వేసి మూడోసారి మోదీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని రాధోడ్ అన్నారు.