ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... జూన్ 2 నుంచి మొదలవ్వబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం జట్టు ఎంపిక పై ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.మరో వైపు మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ తరువాత ఇక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టంతా టీ20 ప్రపంచ కప్ పైనే నెలకొంది.జూన్ 2 వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది.
టీ20 ప్రపంచకప్ నకు భారత జట్టు విషయానికి వస్తే..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ సెలెక్ట్ అయ్యారు.