గుజరాత్ పెత్తనమా.. తెలంగాణ పౌరుషమా?
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. జమ్మికుంట, భూపాలపల్లి, హైదరాబాద్‌లో బాలాపూర్ లో బహిరంగ సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. రిజర్వేషన్లను భాజపా రద్దు చేస్తుందని విమర్శిస్తే అమిత్‌షా దిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించారని దుయ్యబట్టారు. గుజరాత్ పెత్తనమో....తెలంగాణ పౌరుషమో తేల్చుకుందామంటూ భూపాలపల్లి జిల్లా రేగొండ సభలో సవాల్ విసిరారు. భారాస, భాజపా రెండూ ఒకటేనని...ఇద్దరి మధ్యా చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సెమీ ఫైనల్స్‌లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పినట్లే...లోక్‌సభ ఎన్నికల ఫైనల్స్‌లో భాజపాను గద్దె దించాలని కోరారు.