బాబోయ్‌.. ఇవాళ కూడా ఎండలు అదరగొడతాయట?

Chakravarthi Kalyan
తెలంగాణలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం భరించలేని ఎండలు అదరగొట్టగా సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో గత రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అకాలవర్షాలకి పంటలు నీటిపాలయ్యాయి. పలు చోట్ల గాలి బీభత్సానికి ఇంటిపై కప్పులు లేచిపోయాయి. తెలంగాణలో వడదెబ్బ, పిడుగుపాటు కారణంగా 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఎండలతో ఉడికిపోయిన జనం వర్షపు చినుకులతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని జిల్లాలో వడగళ్ల వానపడింది. అత్యధికంగా నల్గొండ జిల్లాల తిప్పర్తి మండలం మామిడాలలో 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 4.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, ధాన్యం తడిచిపోయింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇలా జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పలు జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: