రేవంత్ షాక్: అవి రాముడి అక్షింతలు కాదు.. రేషన్ బియ్యం?
ఈస్టిండియా కంపెనీ తరహాలో ప్రధాని మోదీ, అమిత్‌షాలు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లపై మాట్లాడితే దిల్లీలో కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు దేశానికి ప్రధానిగా చేసిన పెద్దమనిషి రాష్ట్రానికి పది పైసల పనిచేయలేదంటూ ఆక్షేపించారు. దేవుడి పేరిట బీజేపీ నాటకాలాడుతుంటే తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి భారాస నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తుక్కుగూడలో మేనిఫెస్టో ప్రకటనతో దేశంలో గొప్పమార్పునకు నాంది పలికినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.