
బీజేపీ ఆఫీసుపై యుద్ధానికి కేజ్రీవాల్.. ఇంత తెగింపేట్రా బాబూ?
బిభవ్ కుమార్‌ను అరెస్టు చేసిన తర్వాత మాట్లాడిన కేజ్రీవాల్... తమ పార్టీ నేతలను జైలుకు పంపడం ద్వారా ఆప్‌ను అణచి వేయలేరని అన్నారు. మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్, సంజయ్ సింగ్ వంటి ఆప్ నేతలను జైలుకు పంపారని.. ఇప్పుడు మరికొందరిని జైలుకు పంపే కుట్రలు చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ ఎంత మంది ఆప్ నేతలను జైలులో పెట్టిందో దానికి రెట్టింపు సంఖ్యలో నాయకులు పుట్టుకొస్తారని కేజ్రీవాల్ అన్నారు.