ఇరాన్ అధ్యక్షుడిని ఇజ్రాయెలే చంపేసిందా.. రగిలిపోతున్న టెహ్రాన్?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ ఇరాన్ కు చెందిన జనరల్ ను నెతన్యాహూ సైన్యం మట్టుపెట్టడం.. తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. మరోవైపు ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ దళాలు నిలువరించినా.. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో రైసీ దుర్మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంలోనే హెలీక్యాప్టర్ క్రాష్ అయిందన.. ఈ సమయంలో ల్యాండ్ చేయడానికి యత్నిస్తుండగా కుప్పకూలి ఉంటుందని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ నిజంగా చేసి ఉంటే.. ప్రతికూల వాతావరణాన్ని ఆ దేశం సృష్టించలేదు కదా అని కొందరి వాదన.