సీఎం రేవంత్ రెడ్డికి తెజస అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఓ సలహా ఇచ్చారు. ఉస్మానియా కు కొత్త భవన నిర్మాణం విషయంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం ఏర్పాటుపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర, ప్రభుత్వ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రమేష్, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సభ్యురాలు అనురాధా రెడ్డి దీనికి హాజరయ్యారు.
ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం ఏర్పాటు ఆవశ్యకత, అనుకూలమైన స్థలం , మెడికల్ కాలేజీలో సౌకర్యాల అంశాలపై ప్రొఫెసర్ కోదండరాం చర్చించారు. ఉస్మానియా కొత్త భవనాన్ని వీలైనంత త్వరగా నిర్మించి తీరాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం ఉస్మానియా సమస్యను పట్టించుకోలేదన్న ప్రొఫెసర్ కోదండరాం.. త్వరలోనే ప్రభుత్వంతో కొత్త భవంతి నిర్మాణంపై చర్చిస్తామన్నారు.