పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ అలర్ట్.. కుట్ర జరుగుతోందా?
అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని ఎంపీ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ను తిరస్కరించేదుకు దారితీసేలా ఉందని ఎంపీ నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమో ను తక్షణమే సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.