ఈనాడు సంస్థల గ్రూప్ అధినేత రామోజీరావు ఈరోజు ఉదయం 4 గంటల 50 నిమిషాలకు గుండె సమస్య వ్యాధులతో తుది శ్వాస విడిచారు. నానాక్ రామ్ గూడా లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు రోజులుగా ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం శుక్రవారం బాగా క్షమించింది. ప్రస్తుతం ఆయన వయస్సు 88 సంవత్సరాలు.కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 18న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకటసుబ్బమ్మ, వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు. రామోజీరావు తన తాతయ్య అయినటువంటి రామయ్య కుటుంబంతో కలిసి వారితో పాటు నివసించేవారు. రామయ్య చనిపోయిన 13 రోజులకి ఆ రామోజీరావు జన్మించారు. తాతయ్య పేరును రామోజీరావు తల్లిదండ్రులు మొదటగా రామోజీరావు కి పెట్టారు. రామోజీరావు కి ఇద్దరు అక్కలు.అయితే రామోజీరావు ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడు య అనే పేరు నచ్చక మా రామోజీరావు అని సొంతంగా మార్చుకున్నాడు. గుడివాడలో విద్యా భాష్యం పూర్తి చేసి చిన్నగా వ్యాపార రంగంలోకి ప్రవేశించి దిగారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రజలలో నమ్మకాన్ని చోరగొన్నారు. తరువాత 1974 ఆగస్టులో ఈనాడు పత్రిక ప్రారంభించి ఒక సంచలన్ని సృష్టించారు.ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారిపోయింది. ఈనాడుతో పాటు సితార సినీ పత్రిక కూడా ఒక కీలక మైలురాయిగా నిలిచింది. రామోజీరావు జీవిత ప్రయాణంలో ఆయన నమ్మిన రెండే రెండు సిద్ధాంతాలు ఆయన్ని మీడియా మొగల్ గా మార్చాయి అవే ఆయనకు ఉండే బహుముఖ ప్రజ్ఞ మరియు కఠోర శ్రమతో కూడిన సాధన.ఆయన అడుగు వేసిన ప్రతి రంగంలో కూడా సరికొత్త ఒరవడిని సృష్టించారు. తెలుగు భాషా సంస్కృతులకు ఆయన చేసిన సేవలు అహర్నిశలు కష్టపడ్డా మనిషి. రామోజీ ఫిలిం సిటీ స్థాపించి ప్రపంచంలోనే తెలుగు ఘనతను చాటిన వ్యక్తి.ఈరోజు ఉదయం అయిన తుది శ్వాస విడవడంతో ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించనున్నారు.