ఆ టీడీపీ నేత భార్యకు ఓయూ బంపర్‌ ఆఫర్‌.. సస్పెన్షన్‌ ఔట్‌?

Chakravarthi Kalyan
గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సతీమణి ఆంధ్ర విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి లావణ్య దేవి పై విధించిన సస్పెన్షన్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎత్తివేసింది. విశ్వవిద్యాలయం నిబంధనలను ఉల్లంఘించి లావణ్య తన భర్త తరఫున ప్రచారం చేసిందంటూ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏయూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు
ఇచ్చింది.
ఏయూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి విభాగం కంప్యూటర్ సైన్స్ లోనే ఈమె అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. అధికార పార్టీకి అంట కాగిన వ్యక్తిగా ప్రసాద్ రెడ్డి ఈమె ఎన్నికల సందర్భంగా సెలవు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా ఆమెకు నోటీసులు ఇప్పించి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టించి నియమ నిబంధనలు ఉల్లంఘించి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పాటించలేదంటూ సస్పెన్షన్ వేటు వేశారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో డాక్టర్ లావణ్య పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: