ఏపీ కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడి చరిత్ర చూస్తే షాకవుతారు?
మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు ఇప్పటి వరకూ అయ్యన్న పాత్రుడు నిర్వర్తించారు. 1983 నుంచి ఇప్పటివరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు పోటీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు జగన్ను పరుష పదజాలంతో తిట్టడం ద్వారా అయ్యన్న పాత్రుడు బాగా వార్తల్లోకెక్కారు. మరి ఇప్పుడు ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.