ఆ వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు తప్పదా.. చుక్కలు చూపించేస్తారా?
ఈ కేసు కొట్టేయాలని విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హై కోర్టు లో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కావాలంటే ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.