తన హెల్త్ గూర్చి కీలక ప్రకటన చేసిన నారాయణమూర్తి...!

FARMANULLA SHAIK
నారాయణమూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు,నిర్మాత,సంగీత దర్శకుడు,గీత రచయిత.ఇతను 1953 డిసెంబరు 31న తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబం లో జన్మించాడు.నారాయణమూర్తి హేతువాది, అవివాహితుడు.ఆయన తెలుగు సినిమా రంగంలో చేసిన ఎర్రసైన్యం సినిమా ఒక ట్రెండును సృష్టించింది.ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి, విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై, ఆ తర్వాత వచ్చిన సినిమా లకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తి ఒక పది సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తరువాత ఏడు సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు.

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఆయన కొంతకాలంగా అంత యాక్టివ్‍గా లేరు. చివరగా 2021లో రైతన్న చిత్రం చేశారు నారాయణ మూర్తి. ఎన్ని సినిమాలు చేసినా ఆయన సింప్లిసిటీతోనే ముందుకు సాగారు. కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా నారాయణ మూర్తి సున్నితంగానే తిరస్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతాలనే కొనసాగిస్తున్నారు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో రెండవ అంకాన్ని ప్రారంభించాడు.మంగళవారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.ఐతే దానికి సంబంధించి సోషల్ మీడియా లో ఆర్ నారాయణ మూర్తికి ఆరోగ్యం బాగా లేదని, నిమ్స్‌లో జాయిన్ అయ్యారని, తీవ్ర అస్వస్థతకి గురయ్యాడంటూ ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలా తన ఆరోగ్యం మీద వస్తోన్న రూమర్లకు వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందొద్దని, కోలుకున్నాక అన్ని వివరాలు చెబుతాను అని తన అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు.అయితే నారాయణ మూర్తి ఆసుపత్రిలో ఎందుకు చేరారంటూ ఆందోళన మొదలైంది.దీనికి తోడు సోషల్ మీడియా లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రూమర్లు బట్టి ఆయన అభిమానులు అసలు విషయం కోసం ఆరాతీస్తే తెల్సింది ఏమంటే గతంలో ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారని సమాచారం. సాధారణ టెస్టుల్లో భాగంగానే ఆయన ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని తెలుసుకుని అభిమానులు శాంతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: