తెలంగాణ: పాఠశాలల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం..?

FARMANULLA SHAIK
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా సీఎంగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన మార్క్ ను చూపిస్తున్నారు.ముఖ్యంగా ఇచ్చిన హామిలను నేరవేస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విద్యావ్యవస్థను కూడా పటిష్టంగా చేసేందుకు సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారాలని, విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా కోరుకుంటాన్నారు. ఈ దిశగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని.. ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు సాగుతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల పనివేళల్లో మార్పులు చేయాలని చాలా రోజులుగా విజ్ఞప్తులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాక సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో స్కూల్ టైమింగ్స్ మారాయి. రాష్ట్రంలో పాఠశాలల వేళలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మారిన స్కూల్ టైమింగ్స్ పై విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల  సమయానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల స్కూల్ సమయాల్లో మార్పు చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ఉన్నత పాఠశాల వేళలను ఉదయం 9:30 నుంచి 9:00 గంటలకు మార్చారు. అదే విధంగా ప్రతిరోజూ సాయంత్రం 4:45 గంటలకు బదులుగా 4:15 గంటలకు స్కూల్ పని పనివేళలు పూర్తవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో ప్రస్తుతం అమలు అవుతున్న పని వేళలు కొనసాగుతాయని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో ఉదయం 8:45కు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: