ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలకు బిగ్‌ వార్నింగ్‌?

frame ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలకు బిగ్‌ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ డ్యాం నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి దిగువకు సుమారు 23,650 క్యూసెక్కులు విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు 13,370 క్యూసెక్కులు విడుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 16.95 మీటర్ల వరకు నీటి మట్టం ఉంది. త్వరలో పూర్తి స్థాయికి ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం చేరుకుంటుంది. ఎప్పుడైనా మిగులు జలాలను ప్రకాశం బ్యారేజీ దిగువకు విడుదల చేయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. దీని కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More