ఏపీ: రాష్ట్ర ప్రజలను వారానికి ఒక్కసారైన అలా చేయమంటున్న డిప్యూటీ సీఎం..!
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారంలో ఒక్కరోజైన చేనేత వస్త్రాలు ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మన రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి… చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయి. నేడు చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు అనే మాట ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపాయి. అలాంటి చేనేత రంగానికి జీవంపోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.అని ప్రకటనలో పేర్కొన్నారు.ఇదిలావుండగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో నేతన్నలు స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి, చేనేత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి కోసం వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలు కొనుగోలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. చేనేతకారులకు ఇచ్చే అన్ని రుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగోసారి సీఎం అయ్యాక మొదట కలిసింది చేనేత కార్మికులనేనన్న చంద్రబాబు సహకార సంఘాల నేతలు సమర్థవంతమైన వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు.