ఏపీ: బస్ కండక్టర్ చేసిన పనికి ఏడ్చేసిన మహిళా ప్యాసింజర్.!

FARMANULLA SHAIK
అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో కండక్టర్‌ ప్రయాణికురాలు పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి ఇచ్చేశారు. నర్సీప్టనం బస్టాండ్‌ నుంచి బుధవారం విశాఖకు బయలుదేరిన ప్రయాణికురాలు బస్సులో బ్యాగ్‌ మరిచిపోయారు.. ఆమె విశాఖపట్నంలో బస్సును దిగిపోయారు. ఆ తర్వాత ఖాళీ బస్సులోని సీటులో బ్యాగ్‌ ఉండటాన్ని కండక్టర్‌ ఎంపీ రావు గమనించారు. వెంటనే బ్యాగ్ తీసి చూస్తే.. అందులో రూ.20 వేల నగదు, డాక్యుమెంట్లు పరిశీలించారు. ఆ బ్యాగును తీసుకుని సంబంధిత ప్రయాణికురాలికి సమాచారం ఇచ్చి.. ఆమెకు డబ్బుల్ని అందజేశాడు. డిపో మేనేజన్‌ థీరజ్‌ ఇతర అధికారులు తోటి సిబ్బంది కండక్టర్‌ నిజాయితీని ప్రత్యేకంగా ప్రశంసించారు.అయితే ఇలాంటి సమాజంలో నిజాయితీ పరులు కూడా ఉన్నారు. పరుల సొమ్ము పాము వంటిది అని, పరాయి వాళ్ల కష్టం మనకు వద్దు అని నిజాయితీగా ఉండే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారి చేతిలో నగదు పడితే మాత్రం తిరిగి బాధితుల చేతికి చేరుతుంది. ఆ కోవకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. వారు చేసిన పనికి ప్రయాణికులు రాలు కన్నీరు పెట్టుకుంది.ఇదే సమయంలో మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా తన నిజాయితీ చాటుకున్నాడు. బస్సులో విలువైన నగదు, నగలు మర్చిపోయిన ఒక మహిళలుకు ఆర్టీసీ డ్రైవర్లు అప్పగించారు. ఆగష్టు 4న తిరువూరు నుంచి మంత్రాలయం వెళ్లే తిరువూరు డిపో బస్సులో గుంటూరుకు చెందిన వీరలక్ష్మి ఎక్కారు. ఆమె విజయవాడ నుంచి ప్రయాణించారు. ఈ క్రమంలోనే ఆమె కర్నూల్లో బస్సు దిగి వెళ్లే సమయంలో బస్సులో పర్సును మర్చిపోయారు. ఆ తర్వాత పర్సు సంగతి గుర్తుకొచ్చింది.

 ఈ క్రమంలోనే వెంటనే తిరువూరు డిపో ఫోన్‌ చేసి డైవర్ నంబర్ తీసుకొని ఫోన్ చేశారు. తాను ప్రయాణించిన బస్సులోని సీటు వివరాలు తెలియజేసి తాను పర్సు మరిచిపోయిన ఆ డ్రైవర్ కి తెలిపింది. ఇక ఆమె ఇచ్చిన సమచారంతో.. పర్సును గుర్తించి భద్రపరిచారు. ఇక మంత్రాలయం నుంచి బస్సు తిరుగు ప్రయాణంలో కర్నూలు డిపో ట్రాఫిక్‌ అధికారి సమక్షంలో రూ.3, 500 నగదుతో పాటు లక్ష విలువైన బంగారు నగలను, రెండు ఏటీఎం కార్డులను ఆమెకు తిరిగి అప్పగించారు. ప్రయాణికురాలు వీరలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. ఆ డైవర్ల నిజాయితీని ఆమె ప్రశంసించారు. ఇలా పలు సందర్భాల్లో చాలా మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తమ నిజాయితీని చాటుకు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఏపీఎస్‌ఆర్టీసీకి త్వరలోనే మరో వెయ్యి కొత్త బస్సులు రాబోతున్నాయన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి. గత ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 400 బస్సులు కొనుగోలు చేశామన్నారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆయన 14 బస్సులను ప్రారంభించారు. మహిళలకు హామీ ఇచ్చిన విధంగా త్వరలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి 800 బస్సులు కేటాయించిందని తెలిపారు. నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. సంస్థ బలోపేతానికి ఉద్యోగులు, కార్మికులు కృషి చేయాలి అన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా డిపోలోకు కొత్త బస్సులు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: