ఏపీ: హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం..?

FARMANULLA SHAIK
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో 
జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంగలపూడి అనిత… పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు… ఏకంగా చంద్రబాబు కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు.వంగలపూడి అనిత రాజకీయాల్లో రాకముందు ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె… 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ హోంశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.వంగలపూడి అనిత… తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ మహిళా నేతగా గుర్తింపు పొందారు. పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించే నాయకురాలిగా ఎదిగారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ… అధినేత అండదండలతో తనదైనశైలిలో ఏపీ రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు.ఈ నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గ నారాయణపురంలో గల వెంకన్న గారి ఐస్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన అల్పాహారానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారికి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ అనిత గారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమం అనంతరంతిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఏలూరు జిల్లా కైకారం దగ్గర హోంమంత్రి వంగలపూడి అనిత గారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహన డ్రైవర్ రోడ్డుపై బైకును తప్పించ క్రమంలో సడన్ బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది దీంతో కారు స్వల్పంగా ధ్వంసం అయింది.వెంటనే అనిత మరో వాహనంలో వెళ్లిపోయారు.ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకవరం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: