అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలోని ఎసెన్షియా ప్రమాదాన్ని మరువక ముందే అనకాపల్లి ఫార్మా సిటీలో మరో ఘోరం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో భారీ ప్రమాదం జరిగింది.జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు..అయితే సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో జరిగిన ప్రమాదం కూడా ఎసెన్షియాలో జరిగిన విధంగా సంభవించినట్లు అధికారులు తమ ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. కెమికల్స్ కలుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా ప్రమాద విషయాన్ని బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. ఈ ప్రమాద బాధితులు దాదాపు 70శాతం కాలిన గాయాలతో ఉన్నట్లు సమాచారం. వారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై, బాధ్యతుల పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అదే విధంగా ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేలా దర్యాప్తు చేపట్టాలని కూడా సూచించారు.
మరి కాసేపట్లో హోం మంత్రి వంగలపూడి అనిత.. అనకాపల్లి ఫార్మాసిటీకి చేరుకోనున్నారు.ఇక, హోంమంత్రి అనితతో మాట్లాడుతూ.. తక్షణమే ఇండస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరోవైపు.. విశాఖ ఇండస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ నలుగురు కార్మికులను ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు.. వారికి అందుతోన్న చికిత్స.. వారి పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీశారు. ఇండస్ హాస్పిటల్ చికిత్స పొందుతున్న కార్మికుల వివరాలు వెల్లడించారు.. కె.సూర్యనారాయణ- కెమిస్ట్ … రోయా అంగిరియా, పి.లాల్ సింగ్ , కె.వైభన్ – హెల్పర్స్ గా గుర్తించారు.. అక్కడ ఈ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అదే విధంగా ఫార్మా సంస్థల భద్రతపై స్థానిక అధికారులతో కూడా సమావేశం కానున్నట్లు సమాచారం.