మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది ఇండియా టుడే గ్రూప్ ద్వారా నిర్వహించబడే ద్వై-వార్షిక అభిప్రాయ సేకరణ/సర్వే. రాజకీయంగా, ఆర్థికంగా లేదా సామాజికంగా జ్వలించే సమస్యలపై ప్రజల మనోభావాలను సర్వే అంచనా వేస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 అనేది లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చివరి సర్వే మరియు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందని అంచనా వేసిన పెద్ద ప్రశ్నకు ఇది సమాధానం ఇస్తుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 సీఎంల జాబితాలో నిలిచారు. ‘ఇండియా టుడే- సీ ఓటర్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఇందులో... అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు.ఇండియా టుడే- సీ ఓటర్' సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 'మూడ్ ఆఫ్ ది నేషన్' పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం 'ఇండియా టుడే' వెల్లడించింది. ఇందులో... అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు.ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో... స్టాలిన్, చంద్రబాబు నిలిచారు.ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రెండు నెలల్లోనే చంద్రబాబు టాప్-5 ముఖ్యమంత్రుల జాబితాలోకి రావడం విశేషం. ''అభివృద్ధి రాజకీయాలకు దేశంలో చంద్రబాబు చిరునామాగా ఉన్నారు. గతంలో హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేసిన రికార్డు ఆయన సొంతం'' అని దీనిపై జరిగిన చర్చలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 సీఎంల జాబితాలో నిలిచారు.ఈవిషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణం.