ఏపీ: తెలుగు రాష్ట్రాల కోసం నేనున్నానంటూ హిందూపూర్ ఎమ్మెల్యే..?

FARMANULLA SHAIK
ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ  ముందుకొచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద బాధిత ప్రాంతాలలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నష్టం భారీగానే జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది సెలబ్రిటీలు ముందుకు రావడం అభినందనీయం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించగా.. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య  రూ. కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతలా తల్లిడిల్లిపోయాయో తెలిసిందే. ఏపీలో విజయవాడ, పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.
 ఈ నేపథ్యం లోనే 50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను.రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను." అని బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: