ఏపీ: పవన్ ఎక్కడా.? అనేదానిపై స్పందించిన డిప్యూటీ సీఎం..!

FARMANULLA SHAIK
ఏపీలోని విజయవాడను వరదలు ముంచెత్తిన వేళ సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా అక్కడే ఉన్నారు. బాధితులకు అవసరమైన సాయం అందించే విషయంలో సమీక్షలు చేయడంతో పాటు దగ్గరుండి ఆహారం కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియలేదు. కానీ ఇవాళ ఆయనే స్వయంగా విజయవాడ ఎందుకు వెళ్లలేదో వివరించారు.ఆంధ్ర ప్రదేశ్ లో వరదలు ప్రజలకు తీరని కన్నీళ్లను మిగిల్చాయని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ లో భారీగా వరదలు సంభవించాయి. ఎక్కడ చూసిన కూడా వరద ప్రవాహామే కన్పిస్తుంది. అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తాగేందుకు మంచి నీళ్లు, కట్టుకునేందుకు బట్టలు సైతం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం.. వరద ప్రాంతాల్లో ఎక్కడ కన్పించలేదు. దీంతో అపోసిషన్ పార్టీలు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. డిప్యూటీ సీఎంకు బాధ్యతలేదా.. ప్రజల్ని పట్టించుకోవడానికి తీరిక లేదా.. బర్త్ డే పార్టీలలో ఇంకా బిజీగా ఉన్నారా.. అంటూ వైఎస్సార్సీపీ వాళ్లు విమర్శించారు.. దీనికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ అపోసిషన్ పార్టీలకు గట్టిగానే ఇచ్చిపడేశారు. 

వరద బాధితులను కనీసం పరామర్శించలేదని వస్తున్న ఆరోపణలు, విమర్శలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన స్టైల్ లో స్పందించారు. కొందరు కావాలని ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాను భౌతికంగా వరద ప్రాంతాల్లో లేకపోయిన.. అన్ని సహాయక కార్యక్రమాలను మానిటరింగ్    చేస్తున్నానని చెప్పారు. ఆయా శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. వదర ప్రాంతాలలో.. సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగకూడదనే..  నేను వరద ప్రాతాలలో పర్యటించలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం యాక్టివ్ గా పనిచేస్తుందన్నారు. తాను వదర ప్రాంతంలో వెళితే.. అక్కడి అధికారులకు ఇబ్బందులు కల్గవచ్చని అన్నారు.  వైసీపీ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలని చేస్తున్న విమర్శలు, ఏదో మాట్లాడాలని తప్ప వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు.వరదల నేపథ్యంలో.. ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ క్రమంలో..అధికారులు సూచనల మేరకు.. తాను వరద ప్రాంతాల్లో పర్యటించలేదని క్లారిటీ  ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: