సత్యవేడు: గుండెపోటుకి గురైన ఎమ్మెల్యే ఆదిమూలం.!

frame సత్యవేడు: గుండెపోటుకి గురైన ఎమ్మెల్యే ఆదిమూలం.!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. ఎమ్మెల్యే‌గా గెలిచిన కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియోతో దొరికిపోయాడు. ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను.. బాధితురాలు తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బాధితురాలు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు లేఖ రాసింది.గతంలో వైసీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం తాజా ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధిస్తుండటంతో ఆమె టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా వేధింపుల వీడియోలు సైతం బయటపెట్టింది. దీంతో టీడీపీ హైకమాండ్ ఆయనపై వేటు వేసింది. అయితే ఆదిమూలం మాత్రం టీడీపీలో తన ప్రత్యర్దుల కుట్రగా దీన్ని అభివర్ణించారు.ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఆదిమూలంపై బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిలోని భీమాస్‌ ప్యారడైజ్‌ హోటల్‌లో.. తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో హోటల్ సీసీ ఫుటేజ్‌‌ను పోలీసులు సేకరించారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధిస్తూ వీడియోలతో సహా పట్టుబట్ట ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇవాళ ఉదయం గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం లైంగిక వేధింపుల వీడియో బయటపడిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు.ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేసిన అధిష్టానం.. ఆ వీడియోల్ని సైతం ల్యాబ్ కు పంపింది. అవి నిజమని తేలితే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు లేకపోలేదు. ఇవాళ ఆదిమూలం నియోజకవర్గంలో మహిళలు ఆయనకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఆయన గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఆదిమూలం ఆరోగ్య పరిస్ధితిపై కుటుంబ సభ్యుల నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: