తెలంగాణ టెట్ 2024 ఫలితాలు జూన్ 12వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491మంది హాజరయ్యారు. పలితాల్లో పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. టీజీ డీఎస్సీ లో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే తాజాగా డీఎస్సీ ఫైనల్ కీ వెలువడిన సంగతి తెలిసిందే.తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్రంలో మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ నెల 6వ తేదీన తుది ‘కీ’ వెలువడగా.. దానిపై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వందల మంది అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుని పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయానికి సోమవారం తరలివచ్చిన సంగతి తెలిసిందే.తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష లో మార్కులు, హాల్‌టికెట్, ఇతర పలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో దొర్లిన తప్పుల సవరణకు పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇప్పటికే డీఎస్సీ ఫైనల్ కీ విడుదలైన నేపథ్యంలో పదుల సంఖ్యలో అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివస్తున్న నేపథ్యంలో అవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంకు లిస్ట్ (జీఆర్‌ఎల్) ప్రకటిస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులపాటు సవరణలకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రాథమిక సమాచారం. వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా ఎస్‌ఎంఎస్‌లు పంపనున్నారు. నేడో రేపో సవరణలకు అవకాశం ఇస్తూ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలావుండగా డిఎస్సీ అభ్యర్థులు తమ టెట్ వివరాలను ఈ నెల 12,13 తేదీల్లో ఎడిట్ చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13వ తేది తరువాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. డిఎస్సీ లో వచ్చిన మార్పులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల డిఎస్సీ ఫైనల్ కీ విడుదల కాగా, 2-3రోజుల్లో ఫలితాలు రానున్నాయి.ఈ క్రమం లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.ఇక.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేస్తే.. ఆ తర్వాత టెట్ వివరాల ఎంట్రీలో దొర్లిన తప్పులను సవరించే అవకాశం ఉండదు. దీంతో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తం అవుతోందిది. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్ట్ ప్రకటించి, వారందరికీ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.