ఏపీ టెట్ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.వచ్చే నెల అంటే.. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న ఏపీ టెట్ 2024 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రకటించిన తేదీకి అనుగుణంగా సమయంలోపే తమ హాల్‌టికెట్లను వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వివరాలను పరిశీలించుకోవాలని వివరించారు అధికారులు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఏపీ టెట్-2024 పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్టులు కూడా ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. అక్టోబర్ 4 తరువాత నుంచి ప్రైమరీ కీ లను విడుదల చేసి, 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న ఫైనల్ కీ, తుది ఫలితాలు నవంబర్ 2న విడుదల చేస్తారు అధికారులు. ఈసారి ఏపీ టెట్-2024కు 4,27,300 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.ఇదిలావుండగా ఏపీ టెట్‌ను పేపర్–1ఎ, 1బి, పేపర్–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్–1ఎ, పేపర్–1బిలను అయిదు విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్‌లో.. అన్ని పేపర్లకు సంబంధించి కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.ఈ నేపథ్యంలో పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు (150 నిమిషాలు) మరియు ఏదైనా తప్పు లేదా ఖాళీ సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్షా కేంద్రం మరియు వేదికకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు సంబంధిత ఏపీ టెట్ హాల్ టికెట్ 2024 ద్వారా అధికారులు తెలియజేయాలి, దీనిని https://aptet.apcfss.in నుండి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.