ఇజ్రాయెల్ నెక్స్ట్ లేపేసేది ఇరాన్ సుప్రీం లీడర్ నేనా?
ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ రగిలిపోతుంది. ప్రతిదాడికి అవసరం అయిన సైనిక ప్రణాళికను రెడీ చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతున్నాయి.
ఇరాన్ లోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ అత్యున్నత పాలనా కేంద్రాలు లక్ష్యంగానూ ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రధాన కారకుడైన ఇరాన్ సుప్రీం లీడర్ ను తాము వదలబోమని పేర్కొన్నారు. ఇరాన్ చేతిలో బలమైన ఆయుధాలు, అణ్వాయుధాలు ఉండటం మంచిది కాదని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఇరాన్ లోని అణ్వాయుధ పరిశోధన కేంద్రాలపై కూడా తమ సైన్యం దాడులు జరపొచ్చు అని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భారీ భద్రత రహస్య ప్రదేశంలో ఉన్నట్లు తెలుస్తోంది.