ఏపీపై ఫెంగల్ తుపాన్‌ ఎఫెక్ట్‌ ఎంతంటే?

Chakravarthi Kalyan
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాన్... గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిమీ వేగంతో కదులుతోంది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఫెంగల్ తుపాన్‌.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉంది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: