ఏపీకి డేంజర్ సిగ్నల్స్.. ఈ ప్రాంతాలకు వాన ముప్పు?
డిసెంబర్ 10 ,మంగళవారం.. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
డిసెంబర్ 11, బుధవారం.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
డిసెంబర్ 12, గురువారం.. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాకినాడ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.