మాజీ మంత్రి విడదల రజినిపై షాకింగ్‌ రిపోర్ట్‌? జైలు తప్పదా?

Chakravarthi Kalyan
స్టోన్ క్రషర్ యజమానులు బెదిరించి మాజీ మంత్రి విడుదల రజిని రెండు కోట్లు తీసుకున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ అంశంపై విజిలెన్స్ నివేదిక రెడీ అయ్యింది. ఇందులో సంచలనాలు ఉన్నట్టు తేలింది.

స్టోన్ క్రషర్ యజమానులు బెదిరించి మాజీ మంత్రి విడుదల రజిని రెండు కోట్లు తీసుకున్నట్టు  విజిలెన్స్ నివేదిక  తెలిపింది. ఐపీఎస్ అధికారి జాషువా, రజనీ పిఏ తలా 10 లక్షలు తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు విజిలెన్స్ నివేదిక తెలిపింది. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2.20 కోట్లు మాజీ మంత్రి విడుదల రజిని  వసూలు చేసినట్టు విజిలెన్స్ తెలిపింది.

వీరందరి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ ఎండ్ అండ్ ఫోర్స్ మెంట్ ఆదేశాలు  ఇచ్చింది. జాషువా మీద అఖిలభారత సర్వీసుల నియమావళికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. క్రషర్ యజమానుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈ వాస్తవాలు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: