ఏపీకి పొంచి ఉన్న మరో గండం.. జాగ్రత్త?
తీవ్ర అల్పపీడన ప్రభావంతో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు అధికారులు మూడో నంబరు హెచ్చరిక జారీ చేశారు. బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన తుపాన్ల కారణంగానే నష్టపోయిన రైతులు.. మరోసారి వర్షాలంటే హడలిపోతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.